***
Dt.11-5-2016
శ్రీయుత గౌరవనీయులైన మధిర SD-IPO గారికి నమస్కరించి వ్రాసుకొను విన్నపము ఏమనగా...
ఆర్యా !
నేను ** పనిచేస్తున్నాను. నేను Diabetic వ్యాధి తో భాధ పడుతున్నాను . ప్రతి రోజు రెండు సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకొంటున్నాను. బాబు పుట్టినప్పుడు ఒక సారి , పాప పుట్టినప్పుడు ఇంకొక సారి, గర్భ సంచి తొలగించినప్పుడు మరొకసారి మొత్తం మూడు సార్లు నా wife కు Operations జరిగినవి. ఇప్పుడు ఈమె కూడా Diabetic తో భాధ పడుతున్నది. ఇద్దరికి కలిపి నెలకు 3000 రూపాయలు కేవలం మందులకే ఖర్చు అవుతున్నది . ఇక పిల్లల చదువులకు,ఇతర ఖర్చులకు ఇంకా చాలా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ప్రతి నెలా బయట తెచ్చుకొని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకా రెండు సంవచ్చరాలు వరకు పిల్లల చదువులు కొనసాగవలసి ఉన్నది. ఆర్ధిక పరమైన వెసులుబాటు నిమిత్తం అదనముగా పనిచేయాల్సిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడినవి.మా గ్రామానికి చెందిన, మాకు నమ్మకస్తుడైన బి.కోటేశ్వరరావు ను సహాయము తీసుకొని Mustikuntla Mail/Delivery చేయుటకు మీ అనుమతిని కోరుచున్నాను. మీరు మధిర SD-IPO గా ఉన్నంత వరకు మా విశాల ప్రయోజనాలను పరిరక్షిస్తారనే నమ్మకం నాకు ఉన్నది. తరువాత ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. కావునా నాయందు దయవుంచి నా సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి, మీ తోడ్పాటును, సహకారమును అందించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
తమ విధేయుడు
No comments:
Post a Comment